సీబీఐ డీఎస్పీ దేవేందర్ కు బెయిల్

  • ఈ మేరకు ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలు
  • రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు చెల్లించాలన్న కోర్టు
  • ఈ నెల 23న అరెస్టయిన దేవందర్ కుమార్  
సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా వ్యవహారంలో ఇటీవల అరెస్టయిన డీఎస్పీ దేవేందర్ కుమార్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఎవరైనా ఒకరు హామీ ఇస్తూ సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ నెల 23న దేవందర్ కుమార్ ను అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని తిరస్కరించిన న్యాయస్థానం ఆయన్ని రిమాండ్ కు పంపడం తెలిసిందే.
 
Go Back to Shorts
cbi
dsp devender

More Telugu News